Film Celebrities who Voted : తెలంగాణలో ఎన్నికల సమయం కొనసాగుతుంది. రాష్ట్రంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఏ పార్టీకి, ఆ పార్టీ తమదే విజయమని ఆశాజనకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ పోలింగ్ కేంద్రాల వద్ద రాజకీయ ప్రముఖులు అలాగే సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సినీ ప్రముఖులలో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పోలింగ్ బూత్ కి విచ్చేశారు. ఆయన మాలలో ఉండి, లైన్ లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా అల్లు అర్జున్, నాగార్జున అక్కినేని, అమల, విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ తేజ, డైరెక్టర్ రాజమౌళి ఆయన సతీమణి రమా, శ్రీకాంత్, రానా, నితిన్, ఎన్టీఆర్ ఆయన సతీమణి లక్ష్మి ఇలా చాలామంది సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తమ అభిమాన తారలు అలా సాధారణ వ్యక్తుల్లాగా వచ్చి లైన్లో నిలబడి ఓటును వేయడంతో అభిమానులు వారిని చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఓటును వినియోగించుకున్న ప్రతి ఒక్క సినీ ప్రముఖులు, ప్రతి పౌరుడు కూడా తమ ఓటును వేసి మంచి నాయకున్ని ఎన్నుకోవాలి. అది ప్రతి పౌరుడు నిర్వర్తించవలసిన ప్రత్యేకమైన బాధ్యత. ఎవరు దీనిని విస్మరించకూడదు అని ప్రజానీకానికి పిలుపునిచ్చారు.