Foods to Eat on an Empty Stomach : చాలామంది ఉదయాన్నే ఏం తినాలని ఆలోచిస్తారు. కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేస్తారు. కొంతమంది ఖాళీ కడుపుతోనే ఉంటారు. కానీ ఉదయాన్నే పరిగడుపున తినవలసిన ఆహారాల గురించి తెలుసుకుందాం. ఉదయం తినే ఆహారమే రోజంతటికి ఎనర్జీ ఫుడ్ గా ఉపయోగపడుతుంది.ఈ ఆహారమే చాలా ముఖ్యమైనది.
ప్రతిరోజు ఉదయాన్నే బలమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాలను వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో ఐదు బెస్టు ఫుడ్ గురించి వారు చెప్తున్నారు. ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదం ని లేక వాల్ నట్స్ ని తీసుకుంటే వీటిల్లో ఉండే ప్రోటీన్లు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వును ఇచ్చి ఆ రోజంతా కూడా ఎనర్జీటీగా ఉండడానికి ఉపయోగపడతాయి.

అలాగే ఖాళీ కడుపుతో బీట్రూట్, క్యారెట్ జ్యూస్ లు కూడా తాగితే మంచిది. గ్రీన్ వెజిటేబుల్ జ్యూస్ కూడా తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడం కాకుండా విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా మన శరీరానికి అందుతాయి. అలాగే ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తీసుకుంటే రక్తహీనత దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటుంది. శరీరానికి కావలసిన శక్తి ఖర్జూరాల ద్వారా లభిస్తుంది.
అంతేకాకుండా బీపీ కూడా కంట్రోల్ లో ఉండి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే పుచ్చకాయ కూడా ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. ఇది శరీరాన్ని హైబ్రిడ్ కాకుండా ఉంచుతుంది. ఖాళీ కడుపుతో బొప్పాయి పండును కూడా తినవచ్చు. బొప్పాయి పండులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఇది శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపిస్తుంది. మలబద్ధక సమస్య ఉంటే బొప్పాయి పండు తినడం వల్ల తగ్గుముఖం పడుతుంది.
