ప్రస్తుతం దాదాపుగా అందరి ఇళ్ళల్లోనూ ఫ్రిజ్ ఉంది. అందరూ రకరకాల పదార్థాలు వాటిలో పెడుతూ ఉంటారు. కానీ కొన్ని పదార్థాలను ఫ్రిజ్‌లో పెడితే త్వరగా చెడిపోతాయి. అలాంటి కొన్నింటి గురించి తెలుసుకుందాం..
తేనె:
తేనెను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల గడ్డకడుతుంది. బయట రూమ్ టెంపరేచర్‌లో ఉంచితే తేనెలో ఎలాంటి మార్పులు రావు కాబట్టి.. తేనెను ఫ్రిజ్‌లో ఉంచటం మంచిది కాదు.
అరిటిపళ్లు:
అరిటిపళ్లను ఫ్రిజ్‌లో పెడితే గట్టిపడిపోతాయి. త్వరగా చెడిపోతాయి కూడా! అరిటిపళ్లకు సాధారణ రూమ్ టెంపరేచర్ అవసరం. అలాంటి వాతావరణం ఉన్నప్పుడే అవి బాగా పండుతాయి. ఫ్రిజ్‌లో పెడితే ఆ ప్రక్రియ ఆగిపోతుంది. అందువల్ల వీటిని ఫ్రిజ్‌లో పెట్టకపోవటం మంచిది.
నూనె:
కొబ్బరి నూనె, ఆలీవ్ ఆయిల్, వెజిటిబుల్ ఆయిల్ ఇలా ఏ నూనెనైనా ఫ్రిజ్‌లో పెట్టకపోవటం మంచిది. నూనెను ఫ్రిజ్‌లో పెడితే గట్టిపడుతుంది. ఆ తర్వాత అది వాడటానికి పనికిరాదు.
కాఫీ పొడి:
కాఫీ పొడిని ఫ్రిజ్‌లో ఉంచితే.. తేమ వల్ల వాసన పోతుంది. అందువల్ల కాఫీపొడిని ఫ్రిజ్‌లో ఉంచకూడదు.