Funky Movie: ‘జాతిరత్నాలు’ దర్శకుడితో మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. అక్టోబర్ 10న ఫంకీ టీజర్ విడుదల
Funky Movie: యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతున్నప్పటికీ, ఎలాగైనా ఒక భారీ హిట్‌ను సొంతం చేసుకోవాలనే కసితో తన తదుపరి చిత్రం ‘ఫంకీ’పై పూర్తి దృష్టి పెట్టారు. ఈ సినిమాపై ప్రేక్షకులలోనూ, పరిశ్రమలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. ఎందుకంటే, ఈ చిత్రాన్ని ‘జాతిరత్నాలు’ ఫేమ్ దర్శకుడు కేవీ అనుదీప్ తెరకెక్కిస్తున్నారు.
ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సినీ పరిశ్రమలోని కొన్ని అంశాలపై సెటైరికల్‌గా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
టీజర్ విడుదల తేదీ ఖరారు
తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ‘ఫంకీ’ చిత్ర టీజర్‌ను అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నట్లు నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన “సౌండ్, కెమెరా, లాఫ్టర్.. గెట్ రెడీ ఫర్ ఏ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్” అంటూ పోస్ట్ చేశారు, ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
విశ్వక్ సేన్‌కు జోడీగా తమిళ నటి కాయదు లోహర్ నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కేవీ అనుదీప్ గత చిత్రాలు ‘జాతిరత్నాలు’, ‘ప్రిన్స్’ కామెడీకి పెట్టింది పేరు. ఇప్పుడు విశ్వక్ సేన్‌తో కలిసి ఆయన ఎలాంటి వినోదాన్ని పంచుతారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరో రెండు రోజుల్లో రానున్న టీజర్‌తో ఈ సినిమా కాన్సెప్ట్, కథాంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హిట్టు కోసం ఆశగా ఎదురుచూస్తున్న విశ్వక్ సేన్ కు ‘ఫంకీ’ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.