ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్రంలో జాతీయరహదారుల అభివృద్ధి మరియూ రాష్ట్ర రహదారుల నిధులకి సంబంధించి విన్నపాలు వినపించారు.
విజయవాడలో ఫ్లై ఓవర్ ప్రారంభించిన సమయంలో జరిగిన సమావేశంలో సిఎం జగన్ రాష్ట్రానికి రావలసిన నిధుల మీద రహదారుల అభివృద్ది మీద అభ్యర్థనచేసారు.
2019-20 సంవత్సరానికి గాను సెంట్రల్ రోడ్ ఫండ్ నుండి రాష్ట్రానికి రావలసిన నిధులు త్వరగా విడుదల చేయాలని, గత సంవత్సరం సెంట్రల్ రోడ్ ఫండ్ నుండి రాష్ట్రం కి రావలసిన 2611 కోట్లు నిధులకి సంబందించిన ప్రపోజల్ ఆల్రెడీ పంపినట్టు సిఎం తెలిపారు.
విజయవాడ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్టిలో ఉంచుకుని విజయవాడ నగరానికి ఔటర్ రింగురోడ్డు చాలా అవసరం ఉందని, విజయవాడ-హైదరాబాద్ మధ్య ఎక్స్‌ప్రెస్ వే కలుపుతూ ఉన్న బైపాస్ రోడ్డుని, విజయవాడ-చెన్నై నేషనల్ హైవేని కలుపుతూ బైపాస్ రోడ్డు నిర్మించి ఔటర్ రోడ్డు నిర్మించాలని సిఎం కోరారు.
ఈ ఔటర్ రింగ్ రోడ్డు మచిలీపట్నం పోర్ట్ కి కూడా అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని, దాని వల్ల సరుకు రవాణాకి సులభంగా ఉంటుందని జగన్ తెలిపారు.
సిఎం జగన్ అభ్యర్థనపై నితిన్ గడ్కరీ స్పందిస్తూ బెంగుళూరు విజయవాడ మధ్య నిర్మితమైయ్యే గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే గురించి అధ్యయనం జరుగుతుంది అని త్వరలోనే దానిమీద అధికారిక ప్రకటన వస్తుంది అని తెలిపారు. అలాగే బెంగుళూరు చెన్నై మధ్య 5000 కోట్లతో నిర్మాణం అవుతున్న నేషనల్ హైవే చాలాభాగం ఆంధ్రప్రదేశ్ నుండే వెళ్తున్నట్టు గడ్కరీ తెలిపారు.
అనంతపురం విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే కి సంబంధించి సిఎం జగన్ మరోకసారి దేశరాజధాని కి రావాల్సిందిగా గడ్కరీ కోరారు.
అయితే జగన్ అడిగిన విజయవాడ ఔటర్ మీద కానీ బైపాస్ రోడ్టు కనెక్టివిటీ మీద కానీ, సెంట్రల్ రోడ్ ఫండ్ మీద కానీ గడ్కరీ ఎలాంటి సమాధానం ఇవ్వనట్టు సమాచారం.