Gas Cylinder Price:గృహవినియోగదారులకు భారీ షాక్… భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామాన్యుల నెత్తిపై మరో బండ మోదింది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో పేదల బతుకు అగమ్యగోచరం గా తయారు అయిన నేపథ్యంలో మోదీ సర్కార్ తాజాగా వంట గ్యాస్ సిలిండర్ ధర పై 50 రూపాయలు పెంచి సామాన్యులకి పెద్ద షాకే ఇచ్చింది.అటు కమర్శియల్ సిలిండర్ ధర కూడా భారీగా పెంచేసింది.ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిన నేపథ్యంలో ఇప్పుడు వంట గ్యాస్ ధర కూడా మళ్ళీ పెంచడం తో సామాన్యులు కుదేలవుతున్నారు.వచ్చే అరకొర జీతంతో నెట్టుకొస్తున్న వారికి ఇలా నిత్యావసర వస్తువు అయిన గ్యాస్ ధరలు పెరగడం కోలుకోలేని దెబ్బే.
తాజాగా 14.2 కేజీల డొమెస్టిక్ LPG సిలిండర్ ధరపై 50 రూపాయలు పెంచడంతో రూ.మొత్తంగా 1,155 రూపాయలకి చేరింది. అలాగే కమర్శియల్ సిలిండర్ ధర ని కూడా భారీగా 350 కి పెంచారు.పరిస్థితులు చూస్తుంటే మున్ముందు వంటగ్యాస్ ధర 2000 అయినా పెద్దగా అశ్చర్యపోవాల్సిన పనిలేదు అంటున్నారు కొందరు ప్రజలు పెదవి విరుస్తూ.