Geetha Singh : కమెడియన్ ఇంట్లో విషాదం.. కుమారుడి మృతి…
ప్రముఖ హాస్యనటి గీతా సింగ్ ఇంట విషాదం నెలకొంది.
తను దత్తత తీసుకొని పెంచుకుంటున్న కుమారుడు రోడ్లు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం గీతా సింగ్ స్వయంగా వెల్లడించనప్పటికి…సామాజిక మధ్యమాల్లో వైరల్ గా అయింది.
నిజానికి గీతా సింగ్ కి పెళ్లికాలేదు. తన అన్నయ్య ఇటీవల అనారోగ్య సమస్యలతో చనిపోవడం తో… అప్పటినుండి ఆయన కుమారులతో పాటు తన కజిన్ కూతురిని కూడా గీతా సింగ్ సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు.
అయితే అందులో పెద్ద కుమారుడు నలుగురు తోటి స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో గీతా సింగ్ కుమారుడు మృతి చెందాడు. అయితే చనిపోయిన కుమారుడి పేరు, ప్రమాదం ఎక్కడ .. ఎలా జరిగింది.. అన్న విషయాలు తెలియాల్సి ఉంది.