Genelia about Ram Charan and NTR: స్టార్ హీరోలతో నటించిన జెనీలియా
ఒకప్పుడు జెనీలియా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. ఆమె అప్పట్లో యంగ్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్ పోతినేని, సిద్ధార్థ్ లాంటి వారితో రొమాన్స్ చేసింది. జెనీలియా అంటే తెలుగు ప్రేక్షకులకు బొమ్మరిల్లు చిత్రంలోని హాసిని పాత్ర గుర్తుకు వస్తుంది.
ఆ చిత్రంలో జెనీలియా నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. జెనీలియా కెరీర్ లో బొమ్మరిల్లు చిత్రం ది బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. బొమ్మరిల్లుతో పాటు ఢీ, రెడీ, ఆరెంజ్, హ్యాపీ, నా అల్లుడు లాంటి చిత్రాలలో జెనీలియా నటించింది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ని వివాహం చేసుకున్న తర్వాత జెనీలియా సినిమాలకు దూరమైంది.
ఇప్పుడు మళ్లీ జెనీలియా టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటిస్తున్న జూనియర్ చిత్రంలో జెనీలియా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా జెనీలియా మీడియాతో మాట్లాడుతూ టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా ఇటీవల మరణించిన కోట్ల శ్రీనివాసరావు గురించి కూడా జెనీలియా ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంత పెద్ద పాన్ ఇండియా స్టార్లు అవుతారని అనుకోలేదు

కోట శ్రీనివాసరావు గురించి ఎమోషనల్ గా..
బొమ్మరిల్లు చిత్రంలో ఆయనతో నటిస్తున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను. అదే విధంగా రెడీ చిత్రంలో కూడా ఆయనతో నటించినట్లు జెనీలియా గుర్తు చేసుకుంది.