Prabhas Japan Tour: గ్లోబల్ స్టార్ ప్రభాస్ జపాన్ టూర్: ‘బాహుబలి’ స్పెషల్ ప్రీమియర్.. అభిమానులతో ముచ్చట్లు
Prabhas Japan Tour: గ్లోబల్ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న మన ‘డార్లింగ్’ స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన దృష్టి జపాన్‌పై ఉంది. అక్కడ డిసెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ‘బాహుబలి: ది ఎపిక్’ స్పెషల్ ప్రీమియర్ షోలో పాల్గొనేందుకు ప్రభాస్ గురువారం (నేడు) జపాన్‌కు పయనమయ్యారు. ఈ ఈవెంట్‌లో ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నిర్మాత శోభు యార్లగడ్డ కూడా పాల్గొననున్నారు.
‘బాహుబలి: ది ఎపిక్’ చిత్రానికి సంబంధించిన స్పెషల్ ప్రీమియర్‌లను మేకర్స్ డిసెంబర్ 5, 6 తేదీలలో ఏర్పాటు చేశారు. ఈ టూర్ ద్వారా, ‘కల్కి 2898 ఏడీ’ ప్రమోషన్ల సమయంలో జపాన్‌లో కలవలేకపోయిన తన అభిమానులను కలుస్తానని గతంలో ఇచ్చిన మాటను ప్రభాస్ నిలబెట్టుకోనున్నారు. శుక్రవారం (రేపు) ప్రభాస్ అక్కడ అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటించి, వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు. ప్రభాస్ అభిమానులతో మాట్లాడనుండటంతో జపాన్‌లో ఫ్యాన్స్ సందడి వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉంటే ప్రభాస్ తదుపరి సినిమా షూటింగ్‌ల విషయమై కూడా ఓ ఆసక్తికర అప్‌డేట్ ఉంది. ‘యానిమల్’ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇటీవల ప్రభాస్, నటి తృప్తి డిమ్రీపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ జపాన్ పర్యటన కోసం షూటింగ్ నుంచి స్వల్ప విరామం తీసుకున్న ప్రభాస్, తిరిగి రాగానే మళ్లీ ‘స్పిరిట్’ సెట్స్‌లో బిజీ కానున్నారు.
మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజాసాబ్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. హారర్-కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు (పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్‌లు) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రభాస్ నుంచి రాబోయే ఈ రెండు భారీ చిత్రాలపై అభిమానులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
