Priyanka Chopra: లండన్‌లో ప్రియాంక చోప్రా దీపావళి సందడి.. రెడ్-హాట్ లుక్‌లో దేశీ గర్ల్
Priyanka Chopra: భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత ఉత్సాహంగా జరుపుకునే పండుగలలో దీపావళి ముందుంటుంది. పండుగకు పది రోజుల ముందు నుంచే ఈ వెలుగుల వేడుకలు మొదలవుతాయి. ముఖ్యంగా సినీ తారలు విభిన్న పార్టీలు, వేడుకలతో సందడిని మరింత పెంచుతారు. తాజాగా, హాలీవుడ్‌లో స్థిరపడిన బాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సైతం విదేశాల్లో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ‘దేశీ గర్ల్’ తాజాగా లండన్‌లో జరిగిన ఒక ప్రైవేట్ ‘దీపావళి బాల్’ వేడుకకు హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ప్రత్యేక ఈవెంట్ కోసం ప్రియాంక చోప్రా ఎరుపు రంగు డిజైనర్ గౌను ధరించి రెడ్-హాట్ లుక్‌లో మెరిశారు. పండుగ వెలుగుల్లో ఆమె అందం రెట్టింపు కావడంతో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ సందర్భంగా పీసీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆకర్షణీయమైన ఫొటోలను షేర్ చేశారు. “సంవత్సరంలో నాకు ఎంతో ఇష్టమైన రోజుల్లో ఒకటి, ప్రపంచంలోనే నాకు ప్రియమైన నగరాల్లో ఒకటి (లండన్)” అంటూ క్యాప్షన్ జత చేశారు. ఈ పోస్ట్ ఆమె అభిమానులతో పాటు సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.
గత సంవత్సరం కూడా ప్రియాంక చోప్రా లండన్‌లో జరిగిన దీపావళి పార్టీలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రముఖ డిజైనర్ సబ్యసాచి రూపొందించిన ఎరుపు రంగు చీరలో పీసీ సాంప్రదాయబద్ధంగా కనిపించారు. అయితే, ఈసారి మోడర్న్, గ్లామరస్ గౌనులో కనిపించడం అభిమానులకు కొత్త అనుభూతినిచ్చింది. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ, విదేశాల్లోనూ భారతీయ పండుగల ప్రాముఖ్యతను చాటిచెబుతున్న ప్రియాంక చోప్రాను అభిమానులు ప్రశంసిస్తున్నారు.