Godavari Express Train Accident : ఎట్టకేలకు సికింద్రాబాద్ చేరుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్..
ఈ ఉదయం విశాఖ నుండి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు బీబీనగర్ వద్ద పట్టాలు తప్పిన విషయం తెలిసిందే..అయితే తాజాగా పట్టాలు తప్పిన భోగీలని తప్పించి రైల్వే అధికారులు గోదావరి ఎక్స్ ప్రెస్ ని సురక్షితంగా సికింద్రాబాద్ కి పంపడం తో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు..
అయితే ఉదయం బీబీనగర్ వద్ద జరిగిన సంఘటనలో దాదాపు 6 భోగిలు పట్టాలు తప్పినట్టు అధికారులు వెల్లడించారు. పట్టాలు తప్పి కిలోమీటర్ వరకు భారీ శబ్దం తో అలానే ముందుకెళ్లినట్టు కూడా తెలిపారు.. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. కేవలం సెకండ్ క్లాస్ భోగి మరియు S1, S2,S3,S4 లగేజ్ ఉన్న భోగీలు మాత్రమే పట్టాలు తప్పినట్టు వెళ్ళిడించారు..
ఇక సికింద్రాబాద్ చేరుకున్న ప్రయాణికులు మాట్లాడుతూ… “చూస్తుండగానే ఉన్నట్టుండి భారీ శబ్దం వచ్చింది.. ఏం జరుగుతుందో అర్ధం అవక కేకలు వేసాం.. దాదాపు కిలోమీటర్ వరకు అలానే ముందుకు వచ్చి రైలు ఆగాక అప్పుడు కిందకి దిగి చూస్తే పట్టాలు తప్పినయ్ అన్నారు.. ఆ దేవుడి దయ వలన ఎవరికీ ఏమీ కాలేదు.. క్షేమంగా అధికారులు సికింద్రాబాద్ పంపడంతో ఊపిరి పీల్చుకున్నాం” అని తెలిపారు.
ఏదేమైనా అప్పట్లో గతంలో ఇదే ఉమ్మడి నల్లగొండ జిల్లా వలిగొండలో జరిగిన పెను ప్రమాదం జరిగి వందల మంది చనిపోయిన సంఘటన గురించి ప్రయాణికులు గుర్తు చేసుకుంటూ “ఆ భయానక పరిస్థితులు ఊహించుకుంటేనే భయం వేస్తుంది” అని గత దుర్గటన గురించి గుర్తుచేసుకుంటున్నారు..
