ఈ మధ్య కొత్త సినిమాల రిలీజ్ కు సైతం రాని ఎక్సయిట్మెంట్ రీ రిలీజ్ ని చూశాక వస్తోంది అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. బిల్లా 4K ప్రింట్ కి రీ మాస్టర్ చేసి Dolby Atmos సౌండ్ తో అక్టోబర్ 23న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు రాగా.. ఇక ఈ లీగ్‌లోకి ప్రభాస్ ‘బిల్లా’ సినిమా 4K లేటెస్ట్ వెర్షన్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా విడుదల కానుంది. బిల్లా సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దివంగత రెబల్ స్టార్ కృష్ఱంరాజు కీలక పాత్రలో నటించారు.
అనుష్క, నమిత, హన్సిక కథానాయికలుగా నటించారు. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ స్టైలిష్ యాక్షన్ మూవీ ఈ నెల 23న 4కే వెర్షన్ లో రీ రిలీజ్ అవుతోంది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంగీత దర్శకుడు మణిశర్మ, నిర్మాత నరేంద్ర, కృష్ణంరాజు కుమార్తె ప్రసీధ, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, నటులు అలీ, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
పెదనాన్నా నేనూ కలిసి నటించాలనేది ఫ్యాన్స్ కోరిక అని ప్రభాస్ అన్నాడు. అలా ఆయనతో క్యారెక్టర్ చేయించాం. వాస్తవానికి ఈ 4కే షోకి ఆయన ముఖ్య అతిథిగా పిలిచి ప్రదర్శించాలి అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తూ కృష్ణంరాజు గారు మనకు దూరమయ్యారు అని ప్రభాస్ అన్నాడు.