Government Teacher Suicide Attempt in Andhra : తన చావుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కారణమని చెబుతూ ఉపాధ్యాయుడు ఆత్మహత్యయత్నం చేసిన విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే సిపిఎస్ రద్దు చేయలేదన్న బాధతో ఓ ప్రభుత్వ టీచర్ విష గుళికలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతని పేరు మల్లేశం అని తెలుస్తుంది. ఇప్పుడు అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది.
మల్లేశం ఆత్మహత్యాయత్నాన్ని పరిశీలించిన బంధువులు అతడిని హుటాహుటిన ఆ హాస్పిటల్ కి తరలించారు. తన చావుకు సీఎం జగన్ కారణమని బాధితుడు ఒక ఐదు పేజీల లేఖను రాసినట్టు తెలుస్తుంది. ఐదు పేజీల లేకను సామాజిక మాధ్యమాల్లో మల్లేశం పోస్ట్ చేశారు. సీఎం జగన్ ఉపాధ్యాయులను మోసం చేశారంటూ ఆ లేఖలు మల్లేశం పేర్కొన్నారు.

సిపిఎస్ రద్దు, ఐదో తేదీ కల్లా జీతాలు ఇవ్వడమే తన చివరి కోరిక అంటూ మల్లేశం ఆవేదతో ఆ లేఖను రాశారు. అయితే మల్లేశం పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని ఉరవకొండ ప్రభుత్వాసుపత్రి నుంచి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు వెంటనే తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న మల్లేశం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుడు పరిస్థితి ఇలా ఉంటే, సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
