Governor Tamil Sai – Dharani Portal : కాంగ్రెస్ ప్రభుత్వం గద్దనెక్కిన మరుక్షణం నుండే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, అక్రమాలను ఒక్కొక్కటిగా బయటికి తీస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే కేసిఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేసిందా. అన్నట్టుగా వారి ప్రవర్తన కూడా ఉంటుంది. దానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం పదునైన వ్యూహాలను రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే కాదు నిజాలు కూడా.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని ఎన్నికల ముందే కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. కాలేశ్వరం ప్రాజెక్టులో వేలకోట్ల కుంభకోణం జరుగుతుందని, ధరణిలో కూడా చాలా అవినీతి ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం నేతలు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు అలాగే ధరణిపై ఎంక్వయిరీ చేసే అవకాశం ఉందని కూడా అప్పట్లో అందరూ అనుకున్నారు.
కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ రెండు విషయాల పైన ఎటువంటి కామెంట్స్ చేయకపోవడంతో అందరూ సందేహంలో పడ్డారు. తాజాగా అసెంబ్లీలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలు వింటే మాత్రం గత ప్రభుత్వంపై చర్యలు తప్పవని సంకేతాలు స్పష్టంగా తెలుస్తుంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి చర్యలు తప్పవని గవర్నర్ తమిళ సై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు.
ఇప్పుడు ఈ టాపిక్ హాట్ టాపిక్ గా నిలిచింది. కాలేశ్వరం ప్రాజెక్టు పై జరిగిన అవినీతిపై విచారణ ఉంటుందని, దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవని గవర్నర్ స్పష్టం చేశారు. అలాగే ధరణి గురించి కూడా మేము దృష్టిసారిస్తామని గవర్నర్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని చెప్పుకొచ్చిందని, దాదాపు 80 వేల కోట్ల వ్యయంతో రూపొందిన కాలేశ్వరం ప్రాజెక్టు లో వేల కోట్ల అవినీతి జరిగిందనేది ప్రధాన విమర్శగా గవర్నర్ తెలిపారు.
ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు అనుమతి ఇస్తే అవినీతి బయటపడే అవకాశం ఉందా.. లేదా..లేకపోతే లిక్కర్ స్కామ్ మాదిరిగా మరుగునపడే అవకాశం ఉందా.. అనే సందేహాలు కూడా ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతుందని ఆశిద్దాం.. కాంగ్రెస్ దానికి తగ్గట్టుగానే అస్త్రాలను రెడీ చేస్తుందని విషయం కూడా స్పష్టమవుతుంది.