Hamburg church shootout : జర్మనీలోని హాంబర్గ్ సిటీలోని చర్చిలో గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గ్రాస్‌బోర్‌స్టెల్ జిల్లాలోని డీల్‌బోజ్ వీధిలోగల మూడంతస్తుల చర్చి భవనంలో (యెహోవా విట్‌నెస్ సెంటర్) గుర్తు తెలియని వ్యక్తి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మొత్తం ఏడుగురు మరణించగా, చాలామందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది.
ఇంకా మృతుల సంఖ్య పెరగొచ్చు అని తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతం చుట్టూ ప్రక్కల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసారు. పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తూ, చుట్టు పక్కల వాళ్ళు ఇళ్లలోనుంచి బయటికి రావద్దు అని హెచ్చరికలు జారీ చేసారు.
లోపల ఇంకా చాలామంది గాయపడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ దుండగుడు కాల్పులకు ఎందుకు పాల్పడ్డాడో ఇంకా కారణం తెలియరాలేదు. ఇదిలా ఉండగా సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు, కాల్పుల అనంతరం దుండగుడు చర్చి నుండి బయటికి రాలేదని, కాల్పుల తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అని పోలీసులు అభిప్రాయ పడుతున్నారు.