Hansika : హన్సిక బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తూనే తర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ లో అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ రోజుల్లో హన్సిక అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. అప్పట్లో యాపిల్ బ్యూటీ గా ఈ అమ్మడు బాగా ఫేమస్ అయిపోయింది.
ఇంకా ఆ సినిమాతో వెనుతిరిగి చూసుకోకుండా, ఈ అమ్మడు చాలా ఆఫర్స్ ని తెలుగు ఇండస్ట్రీలో పొందింది. దాదాపు అందరూ హీరోలతో నటించేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు తమిళ ఇండస్ట్రీలో కూడా తనదంటూ ముద్రవేసింది. తాజాగా ఈ అమ్మడు ఈ సంవత్సరమే పెళ్లి పీటలు ఎక్కింది. ఆ తర్వాత సినిమాలకు కాస్త దూరమైనప్పటికీ ఇప్పుడు మళ్ళీ సినిమాలలో నటించే ఇంట్రెస్ట్ చూపిస్తుంది.

హన్సిక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ ఫొటోస్ ని షేర్ చేస్తూనే నెటిజెన్స్ ఇచ్చే కామెంట్స్ కి రిప్లై ఇస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇన్స్టాలో తన లేటెస్ట్ హాట్ ఫొటోస్ ని షేర్ చేసి కుర్ర కారును మరింత కిర్రెక్కిస్తుంది. ఇన్స్టాల్ లో తన గ్లామర్ షో తో తన మనసులోని కోరికను బయటపెట్టింది హన్సిక. హన్సిక పెళ్లయినా కూడా తన అందం ఏ మాత్రం తగ్గలేదని, ఇంకా తను మునిపటి కంటే ఇప్పుడు ఎంతో అందంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు హన్సిక షేర్ చేసిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నయి.
