ఒక్కొక్కరుగా వెయిటింగ్ లిస్టులో ఉన్న హీరోయిన్స్ అందరూ రీసెంట్ గా పెళ్లి పీటలు ఎక్కారు. ఆలియా, కత్రినా కైఫ్, నయనతార పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలియానా అదే తరహాలో హన్సిక కూడా పెళ్లి ముహూర్తానికి డేట్ ఫిక్స్ అయినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా సీరియల్స్ లో కెరీర్ మొదలుపెట్టిన హన్సిక తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించింది. తెలుగులో 2007 లో వచ్చిన పూరి జగన్నాథ్ తీసిన దేశముదురు సినిమా తో హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరై హిట్ కొట్టింది. తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్, కళ్యాణ్ రామ్, సిద్ధార్థ్ మొదలగు వారితో నటించింది.
తమిళ్ లో నటించిన కొన్ని సినిమాలు నిరాశ చూపించినా వెలాయుధం సినిమాలో విజయ్ సరసన నటించి విజయాన్ని అందుకుంది. హిందీలో హవా, జాగో, కోయి మిల్ గయా, అబ్రకదబ్ర, వంటి సినిమాలో నటించింది. కొంతమంది హీరోలతో ప్రేమాయణం నడుపుతున్నట్లు పుకార్లు వచ్చినా నటుడు శింబు తో ప్రేమలో ఉన్నట్టు క్లారిటీ ఇచ్చింది. తర్వాత ఆ ప్రేమకు బ్రేకప్ చెప్పింది.
ఇప్పుడు తనకి ఇష్టమైన వారితోనే తన వివాహం జరుగుతున్నట్లు, తన పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయి, విలాసవంతమైన జైపూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా తన పెళ్లి జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ప్రతి సంవత్సరం తన పుట్టిన రోజున ఒక అనాధను దత్తత తీసుకుంటుందట. ఇప్పటివరకు తను దత్తత తీసుకున్న వారి సంఖ్య 25 పైనే ఉందట.
