Hansika Motwani: హన్సిక ఇన్‌స్టా పోస్ట్ వెనుక ఉన్న అసలు కథేంటి? విడాకులు ఇచ్చేసినట్టేనా?
Hansika Motwani: గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లతో వార్తల్లో నిలుస్తున్న నటి హన్సిక మోత్వానీ, తాజాగా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో మరోసారి చర్చనీయాంశంగా మారారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆమె పెట్టిన ఆసక్తికరమైన పోస్ట్, ఆమె విడాకుల వార్తలకు మరింత బలాన్ని చేకూర్చుతోంది.
2022 డిసెంబర్‌లో వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో ఆమె వివాహం వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన దృశ్యాలను ‘లవ్ షాదీ డ్రామా’ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీగా కూడా విడుదల చేశారు. అయితే, గత కొన్ని రోజులుగా హన్సిక, సోహైల్ విడివిడిగా ఉంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, సోహైల్ ఈ పుకార్లను ఖండించినప్పటికీ, హన్సిక మాత్రం మౌనం వహించారు.
ఆ పోస్టు ఎందుకు పెట్టింది?
తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్ట్ ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. “ఈ సంవత్సరం నేను అడగకుండానే నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నాలో నాకు తెలియని బలం ఉందని తెలిసింది. ఈ పుట్టిన రోజున మీ అందరి శుభాకాంక్షలతో నా హృదయం ఉప్పొంగిపోతోంది, ప్రశాంతంగా ఉంది. కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. అందరికీ ధన్యవాదాలు” అని ఆమె పేర్కొన్నారు. ఈ మాటలు, ఆమె ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలను పరోక్షంగా సూచిస్తున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అధికారికంగా చెప్పని హన్సిక
విడాకులపై హన్సిక కానీ, ఆమె టీం కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఆమె పోస్ట్ విడాకుల వార్తలకు ఊతమిస్తున్నాయని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం హన్సిక ‘శ్రీ గాంధారి’ అనే సినిమాలో నటిస్తున్నారు.
కాగా.. హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేసింది. మొదటిసారి సోహైల్ ప్రపోజ్ చేసినప్పటి ఫోటోల నుంచి, వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోల వరకు అన్నీ తొలగించడంతో, విడాకులు దాదాపుగా ఖరారైనట్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.