Hari Hara VeeraMallu Pre Release Business: ప్రీమియర్ షోలతో వీరమల్లు సందడి
ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం బుధవారం నుంచి థియేటర్లలో సందడి చేయబోతోంది. గురువారం రోజు ఈ చిత్రం రిలీజ్ అవుతుండగా అంతకంటే ఒక రోజు ముందే బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించబోతున్నారు. చాలాకాలం తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ప్రమోషన్స్ చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ చిత్రంలో క్లైమాక్స్ ఫైట్ ని తానే డిజైన్ చేశానని పవన్ కళ్యాణ్ రివీల్ చేశారు. తన కెరీర్ లో ఎంతో కష్టపడి నటించిన చిత్రం ఇదేనని పవన్ అన్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఆన్ లైన్ లో టికెట్ల కోసం పవన్ ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. హరిహర వీరమల్లు ఓపెనింగ్ రికార్డ్ స్థాయిలో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ బిజినెస్
నిర్మాత ఏం రత్నం భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ఎన్ని కోట్ల వసూళ్లు రాబడితే హిట్ అవుతుంది? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. హరిహర వీరమల్లు చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 103 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్, ఇండియాలోని ఇతర ఇతర ప్రాంతాలు మొత్తం కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు చిత్రానికి 127 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఈ మూవీ హిట్ కావాలంటే దాదాపు 130 కోట్ల షేర్ రాబట్టాలి.
సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే టార్గెట్ ని రీచ్ కావడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. మొఘల్ సామ్రాజ్య అధినేతగా ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటించారు.