Health Tips : ఎండాకాలం వచ్చిందంటే చాలు వేడి తాపానికి తట్టుకోలేక అందరూ ఫ్రిడ్జ్ వాటర్ ని ఆశ్రయిస్తారు. చల్లటి నీళ్లను తాగుతుంటారు. ఫ్రిడ్జ్ లో పెట్టిన నీళ్లను తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు.
ఫ్రిడ్జ్ వాటర్ వల్ల నష్టాలు..
* భోజనం తిన్న వెంటనే చాలామంది గడ, గడ నీళ్లు తాగేస్తారు. ఇలా తాగడం వల్ల జీర్ణక్రియకు నష్టం కలిగే అవకాశం ఎక్కువ. ఇది జీర్ణ క్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
* అన్నం తిన్న వెంటనే చల్లని నీరు తాగడం వల్ల శరీరంలో కొవ్వు బయటకు పోదు. కారణంగా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ.
* చల్లటి నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వచ్చి, కడుపు నొప్పి ఎక్కువవుతుంది.
* తరచుగా చల్లని నీరు త్రాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.
* చల్లని నీరు తాగడం వల్ల గుండెలోని వాగాస్ నరాల మీద ఆ ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది.
* బాగా చల్లటి నీరు త్రాగడం వల్ల గొంతులోని సున్నిత మైన, సురక్షిత పొరపై ప్రభావం పడుతుంది. దీనివల్ల గొంతు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
* ఫ్రిడ్జ్ లోని చల్లని నీళ్లు త్రాగడం వల్ల నాడీ వ్యవస్థ చల్లబడి హార్ట్ రేట్ తగ్గిపోతుంది.
దీని వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
* ఎండాకాలంలో శరీరంలో నీటి శాతం పెంచుకోవడానికి , ఫ్రిజ్లోని చల్లని నీళ్లకు బదులు పండ్ల రసాలు, కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.
* అందుకే ఫ్రిడ్జ్ కు బదులు ప్రత్యామ్నాయంగా మట్టి కుండలోని నీరు తాగితే ఆరోగ్యానికి, శరీరానికి ఆరోగ్యకరం.