Health Tips : నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. నీళ్లను రోజువారి జీవితంలో తగిన మోతాదులో తీసుకుంటే చాలా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అందులో ముఖ్యంగా “బరువు” సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. మన రోజువారి జీవితంలో నీళ్లు తాగే విషయాన్ని వాయిదా వేస్తూ ఉంటాం. కొందరైతే భోజనం తిన్నప్పుడు తాగితే మళ్ళీ తినేటప్పుడు మాత్రమే తాగుతారు. అలా చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం అంటున్నారు నిపుణులు.
నీళ్లు తాగి బరువు తగ్గడం ఎలా..
ప్రతిరోజూ నీటిని ఎక్కువగా తాగితే సులువుగా
బరువు తగ్గుతారు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నీటిని ఎక్కువగా తాగితే క్యాలరీలు తీసుకోవడం తగ్గి క్రమంగా బరువు తగ్గుతూ వస్తారు. అయితే నీటిని తీసుకుంటూ వ్యాయామం కూడా చేస్తే ఈ అధిక బరువు సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు.
నీటిని ఏ సమయంలో ఎప్పుడు తాగాలి..
* ఆహారం తినడానికి వెళ్లే ముందు ఒక గ్లాస్ వాటర్ తాగడం వల్ల ఆకలి చాలా వరకు తగ్గుతుంది. అలాంటప్పుడు మితమైన ఆహారం మనం తీసుకుంటాం.
* ఉదయం లేవగానే 500 మిల్లీలీటర్ల నీటిని తాగడం వల్ల రోజంతా జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది.
* చల్లటి పానీయాలు, కృత్రిమ పానీయాలు తీసుకోకుండా వాటికి బదులుగా నీళ్లను తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
* క్యాలరీలు తగ్గించే ఫుడ్ తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, రోజుకు 1.5 నుంచి 2 లీ. నీటిని తాగితే చాలా మంచిది.
* మనం ఏదైనా పని చేసి అలసిపోయినప్పుడు వెంటనే శీతల పానీయాలను తాగుతుంటాం. అలాంటప్పుడు వాటిల్లో ఉండే చక్కెర స్థాయి మీ బరువు పెరగడానికి కారణం అవుతుంది.
ఆ పానీయాలు స్థానంలో నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
* భోజనం చేయగానే చాలామంది వెంటనే గడ, గడ నీళ్లను తాగేస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అలా తాగడం వల్ల పొట్ట ఉబ్బి ఆహారాన్ని జీర్ణం చేసే రసాయనాలు పల్చబడి మలబద్ధకానికి దారి తీస్తాయి. నీళ్లు తాగకుండా ఉండలేని వారు ఆహారం తిన్న తర్వాత కొన్ని నీళ్లు మాత్రం తాగవచ్చు.