Health Tips : మనిషి జీవించడానికి ఆహారం అవసరం. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం లేదా పాడు చేసుకోవడం రెండు కూడా వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. ఆరోగ్యంగా ఎక్కువ రోజులు జడేవించాలి అంటే.. ఈ ఆరోగ్య సూత్రాలను పాటించండి..
* సహజంగా పండించిన ఆహారాన్నే తినాలి.
కాయగూరలు, పండ్లను,ఆకుకూరలు, మంచి నీటిలో కడిగిన తరవాతనే తినాలి.
* వీలైతే ఉప్పు వేసి కడిగిన ఆకుకూరలు, కూరగాయలు వాడాలి. అలా చేయడం వల్ల దాని మీద ఉన్న కొన్ని ఫంగస్, బ్యాక్టీరియా పోతాయి. రసాయనాలు వాడి కూరగాయలు పండిస్తారు. అలాంటి వాటిని ఉప్పు నీళ్ళల్లో కడిగితే పురుగు మందులను పోగొట్టొచ్చు..
* తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఋతువుల ప్రకారం దొరికే ఆహారాన్ని తీసుకోవాలి కానీ
విరుద్ధమైన ఆహారాన్ని అసలే తినరాదు.
* ఎక్కువ కాలం నిలువ ఉండే ఆహారాన్ని అస్సలు తినరాదు, ప్రతి పదార్థానికి జీవిత కాలం అనేది ఉంటుంది.
* చెడు వాసన వచ్చే ఆహారాన్ని అసలే తినకూడదు.
* ఎక్కువగా పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
బీర, తృణ ధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, ఆకు కూరలు, చిలగడదుంప లాంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
* మనకున్న ఆరోగ్య సమస్యలని బట్టి ఆహారాన్ని తీసుకోవాలి.
ఉదా : మధుమేహం ఉన్నవాళ్లు చక్కర ఉన్న పదార్థాలను తినకపోవడం మంచిది.
గుండె సమస్యలు ఉన్నవాళ్లు అయితే బాదాం లాంటి పదార్థాలు తినడం మంచిది.
* ఆహారంతో పాటు మనిషికి నిద్ర కూడా చాలా అవసరం. అయితే వయసు పెరిగే కొద్దీ నిద్ర సమస్యలు వస్తాయి. సమయం ప్రకారం కంటినిండా నిద్ర పోతే చాలా వరకు ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చు.
Discussion about this post