Health Tips : శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడ్డప్పుడు ఒంటరిగా ఉండాలి అనుకుంటాం. మన చుట్టూ ఉన్నవాళ్లు కొందరు ఒంటరిగా ఫీల్ అవడం మనం చూస్తూనే ఉంటాము. మాదకద్రవ్యాల వ్యసనం, ఆత్మహత్య ఆలోచనలు, మానసిక సమస్యలు, ఇంకా ఇతర వ్యాధులు ఇలాంటివి ఎన్నో కారకాలు ఒంటరితనానికి కారణం అవుతాయి.
ఇలా ఒంటరిగా ఉండి ఘర్షణ పడడం వల్ల అకాల మరణం సంభవించే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒంటరిగా ఉన్న వాళ్లలో ఎక్కువగా గుండె జబ్బులు, డయాబెటిస్, నిరాశ, ఆందోళన, అధిక రక్తపోటు వంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ.
ఒంటరితనం వల్ల వచ్చే సమస్యలు..
* ఆందోళన..
ఈ ఆందోళన ఉన్నవారు ఎదుటివారితో ఎక్కువగా కలవలేరు. ఎక్కువగా మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్లకి భయం, అవమానాన్ని కలిగిస్తుంది.
* డిస్థేమియా..
డిస్థేమియా పెర్సిస్టెంట్ డిజార్డర్ ని (పిడిడి) అని కూడా అంటారు. దీనినే మానసిక ప్రవర్తన రుగ్మత అని కూడా అంటారు. ఇది శారీరకమైన సమస్య కాదు. కానీ దీని బారిన పడినవారు ఎప్పుడు ఒంటరిగా ఉండాలి అని కోరుకుంటారు. డిస్తేమియా అనేది దీర్ఘకాలికంగా ఉండే ఆరోగ్య సమస్య. దీని బారిన పడినవారు ఆత్మవిశ్వాసాన్ని ,ఆత్మగౌరవాన్ని క్రమంగా కోల్పోతూ ఉంటారు.
* క్యాన్సర్..
ఒంటరిగా ఉన్నప్పుడు మన మీద ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల హార్మోన్లలో ఎన్నో మార్పులు వస్తాయి. అలా రావడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దానివల్ల క్యాన్సర్ ప్రమాదం పెరగవచ్చు అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
* రక్తపోటు..
అధిక రక్తపోటు, గుండెపోటు, ఉబకాయం వంటి శారీరక సమస్యలు ఒంటరిగా ఉన్నవారిలో ఎక్కువగా వస్తుంటాయి. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 29 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. స్ట్రోక్ బారిన పడే ప్రమాదం 32 శాతం ఉంటుంది.
* డయాబెటిస్ మెల్లిటస్..
ఒత్తిడి, ఒంటరితనం డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. అధిక బరువుతో బాధపడే వారికి ఇతరులతో పోల్చితే రెండు రకాల డయాబెటిస్ లు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి.
* గుండెకు సంబంధించిన వ్యాధులు..
ఒంటరితనంగా ఫీల్ అయ్యే వృద్ధ మహిళల్లో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఒంటరిగా ఉంటూ ఋతుక్రమం ఆగిపోయిన మహిళల్లో గుండెజబ్బులు ఎక్కువగా వస్తుంటాయి.