Heart Attack in Children : ఈ రోజుల్లో గుండెపోటుతో చిన్న పిల్లలు కూడా ఆకుల్లా రాలిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు ఆకస్మికంగా వచ్చి, నిండు జీవితాలను అర్దాంతరంగా ముగిసేలా చేస్తుంది. ఈ గుండెపోటుతో ఇటీవల కాలంలో ఇద్దరు పిల్లలు చనిపోవడం చాలా విషాదకరం. ఈ ఘటన గుజరాత్ లో జరిగింది.
ఆ ఇద్దరు పిల్లల్లో ఒకరి వయస్సు 14 సంవత్సరాలు, ఇంకొకరి వయసు 17 సంవత్సరాలు. అంత చిన్న వయసులోనే పిల్లల జీవితాలు గుండెపోటు అనే కారణంతో ముగిసిపోయాయి. ఆ కుటుంబాల్లో ఎంతో విషాదాన్ని నింపాయి. అయితే నిపుణుల నివేదికల ప్రకారం గుండెపోటు చిన్నపిల్లల్లో రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పుట్టుకతో గుండె జబ్బు : కొంతమంది పిల్లలకు పుట్టుకతోనే గుండె జబ్బు ఉంటుంది. ఈ వ్యాధి వల్ల గుండె కవటాలలో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది దానివల్ల గుండె లోపల వాల్వ్ లో రక్తప్రసరణ సక్రమంగా జరగక హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ వల్ల ఎడమవైపు గుండె అభివృద్ధి చెందదు. యునైటెడ్ స్టేట్స్ లో ప్రతి సంవత్సరం ఒక శాతం మంది శిష్యులకు ఈ వ్యాధి సంభవిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ వ్యాధి వల్ల పిల్లలు, యువకులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు.
పుట్టుకతో గుండెకు రంధ్రం : కొంతమంది పిల్లలు పుట్టుకతోనే గుండెకి రంధ్రంతో పుడతారు. ఈ రంధ్రం వల్ల గుండెలో రక్తప్రసరణ తగ్గిపోవడం మొదలవుతుంది. వెంట్రిక్యులర్ సెప్టల్ లోపం, కర్ణిక సెప్టల్ లోపం, రోగి డక్టస్ ఆర్టెరియోసస్. ఈ నాలుగు లోపాలు సమ్మేళనం అయి ఫాలోట్ టెట్రాలజీని కలిగి,వెంట్రిక్యులర్ సెప్టంలోని రంధ్రం, కుడి జఠరిక, పుపుస ధమని మధ్య ఇరుకైన మార్గం, గుండె కుడివైపు గట్టిపడటం చేస్తాయి.
పుట్టుకతో గుండె జబ్బులు : కొందరిలో పుట్టుకతో గుండె జబ్బులు వచ్చి వాటి ప్రభావం జీవిత కాలం మొత్తం ఉంటుంది. ఇలాంటివారు శస్త్ర చికిత్స, కథాటర్ విధానాలు, మందులు వీటితో చికిత్స చేయవచ్చు కానీ అనుకోని విధంగా ఒక్కోసారి గుండెపోటుకు గురికావాల్సి వస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వ్యాధిలో రక్తప్రసరణలో వాపు ఏర్పడి చిన్న పిల్లల్లో, చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి ముఖ్య కారణం అవుతుంది.