Heart Attacks:గుండెపోటు మరణాలు తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం
ఈ మధ్య అకస్మాత్తుగా గుండెపోటు కి గురి అయి ప్రాణాలు పోతున్న వారి సంఖ్య రోజురోజుకీ అధికం అవుతుండడంతో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు తెలంగాణా ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టి పెట్టింది.ఈ మధ్య గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువ అవడం చూస్తున్నాం. అప్పటివరకు ఉల్లాసంగా ఉత్సాహం గా ఉంటూనే,ఉన్నట్టుండి అకస్మాత్తుగా చనిపోతున్న సంఘటనలు ఈ మధ్య చాలా చోట్ల చూస్తున్నాం.ఇందులో వయసు అనేది తేడా లేకుండా చిన్న పిల్లలు కూడా గుండెపోటు వచ్చి చనిపోవడం చాలా బాధాకరం.
అయితే గుండెపోటు వచ్చి వ్యక్తి అకస్మాత్తుగా ఉన్నట్టుండి గుండె ఆగి అలానే పడిపోతున్నారు, అయితే హాస్పిటల్ కి తీసుకెళ్ళేలోపే చాలా మంది మధ్యలోనే చనిపోతున్నారు . అయితే గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా పడిపోయి గుండె ఆగినప్పుడు అతనికి CPR చేసి మళ్ళీ గుండె కొట్టుకునేలా చేసి,ఆ వ్యక్తి తిరిగి ప్రాణాలతో బయటపడేలా చేయవచ్చు.కానీ CPR పై చాలామంది జనాలకి అవగాహన లేకపోవడంతో ఆసుపత్రికి వెళ్ళేలోపే గుండెపోటు వచ్చిన వారు ప్రాణాలు విడుస్తున్నారు..
అయితే ఇలా మధ్యలోనే ప్రాణాలు పోకుండా తెలంగాణా ప్రభుత్వం CPR చేసి బాధితుడి ప్రాణాలు నిలబెట్టేందుకు ,అందుకోసం జనాల్లో నిత్యం పనిచేసే ప్రంట్ లైన్ వారియర్స్ అయిన పోలీసులు,మున్సిపల్ ఉద్యోగులు,ఇతర కార్మికులకు CPR పై అవగాహన తో పాటు మెళకువలు నేర్పించాడానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.ఇందులో భాగంగా మొదటగా హైదరాబాద్ లోని గోషామహల్ కానిస్టేబుళ్ళకి అధికారులు శిక్షణ ఇస్తున్నారు.ఏదేమైనా ఇలా నిత్యం జనాల్లో ఉండే ప్రంట్ వారియర్స్ కి శిక్షణ ఇవ్వడం అన్నది చాలా మంచి నిర్ణయం అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.