తెలంగాణాను ఆనుకొని ఉన్న చత్తీస్ గడ్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడిందని, దాని కారణంగా రాగల ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బుధవారం రాత్రి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వ్యాపార కలాపాలు పూర్తయ్యి ఇళ్లకు చేరుకునే సమయం లో కురిసిన వర్షానికి ప్రజలు ఎన్నో ఇబ్బందులకు లోనయ్యారు. మరోవైపు ఈ నెల 20వ తేదీ నుండి మరో అల్పపీడనం ఏర్పడనుందని, దాని కారణంగా వచ్చే ఐదు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
