Hero Nani :సరిపోదా శనివారం యాక్షన్ గ్లింప్స్ రెడీ..!!
న్యాచురల్ స్టార్ నాని,డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం సరిపోదా శనివారం.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇక తనకు అంటే సుందరానికీ తో భారీ ప్లాప్ ఇచ్చినా కూడా మరోసారి వివేక్ ఆత్రేయ ను నమ్మి ఛాన్స్ ఇచ్చాడు నాని. అయితే ఈ సారి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడట వివేక్. సినిమా అయితే బాగానే వస్తుందట.
Mrunal Thakur at Cannes : సీత అందాల ఆరబోత..
ఇదిలావుంటే నాని బర్త్ డే సందర్భంగా ఈసినిమా టీం సప్రైజ్ ప్లాన్ చేసింది. సరిపోదా శనివారం నుండి శనివారం రోజు ఉదయం11:59గంటలకు గ్లింప్స్ ను విడుదలచేయనున్నారు. ఈ గ్లింప్స్ ను అదిరిపోయేలా కట్ చేశారట. యాక్షన్ సన్నివేశాలతో రానున్న ఈ గ్లింప్స్ ఆకట్టుకోనుందట. మరి ఈ చిన్నపాటి టీజర్ సినిమాకు ఎలాంటి హైప్ తీసుకొస్తుందో చూడాలి. ఈసినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.
ఇక ఇప్పటికే దాదాపు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి కావడంతో మేకర్స్ హ్యాపీ గా వున్నారు. తెలంగాణ ,ఆంధ్రా కుగాను థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకోగా ఓటిటి రైట్స్ ను భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.ఇక థియేట్రికల్ రిలీజ్ విషయంలో మేకర్స్ డేట్ ను ఫైనల్ చేయలేకపోతున్నారు. మొదట దసరాకు వద్దామనుకున్నారు కానీ అదే టైం కు ఎన్టీఆర్ దేవర విడుదలవుతుంది. దాంతో ఏడాది చివర్లో విడుదలచేసే ఆలోచనలో వున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రానుంది.