తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా హై కోర్టు పలుమార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయినా ప్రభుత్వ పనితీరులో మార్పు కనిపించకపోవడంతో తెలంగాణలో కరోనా టెస్ట్ లు ఎందుకు తగ్గించారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రోజుకు 40 వేల పరీక్షలు చేస్తామన్న హామీ ఎందుకు అమలు కావడం లేదు? వెయ్యి మందికి కనీసం మూడు బెడ్ లు లేకపోవడానికి కారణం ఏమిటి? అని ప్రశ్నించింది. డబ్ల్యూహెచ్వో ప్రమాణాల ఆధారంగా హాస్పటల్లో బెడ్లు ఎందుకు లేవు? మహారాష్ట్రలో రోజుకు లక్ష టెస్టులు చేస్తున్నారని న్యాయస్థానం గుర్తుచేసింది. మిగతా రాష్ట్రాల కంటే ఎందుకు వెనుకబడి ఉన్నారని ప్రశ్నించింది. మరోవైపు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్ తండ్రి కరోనాతో మరణించిన కారణంగా నివేదిక సమర్పించడానికి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గడువు కోరారు. అలాగే హాస్పిటల్స్ లో పడకలు కల్పించే ప్రమాణికాలు ఉన్నాయా తెలపాలని హైకోర్టు వివరణ కోరింది. కోర్టు అక్టోబర్ 8 వరకు విచారణ వాయిదా వేసింది.
