Hindu Marriage : భారత దేశంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహానికి చాలా ప్రత్యేకత ఉంది. పూర్వకాలంలో పెద్దలు.. పెళ్లి చేస్తే ఆరునెలల వరకు మర్చిపోకుండా ఉండాలి. ఇటు ఏడు తరాలు, అటు ఏడు తరాలు ఈ పెళ్లి గురించే మాట్లాడుకోవాలి. అని అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు జరిపించేవారు. భాజాభజంత్రీలు, తలంబ్రాలు, మంగళసూత్రం, పచ్చని పందిరి,
వివాహవిందు ఇలా ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది భారతదేశపు వివాహం. పూర్వం మన ఆచారాల ప్రకారం పెద్దలు ఐదు రోజుల పెళ్లి,మూడు రోజుల పెళ్లి అని ఇలా రోజుల వారీగా పెళ్లిళ్లు జరిపించేవారు. రాను, రాను వివాహ వ్యవస్థలో మార్పు వచ్చింది. ఇది మాత్రమే కాదు వివాహం అనేది రెండు కుటుంబాల ,రెండు వంశాల కలయిక. ఒక వివాహంతో ఇరు కుటుంబాల మధ్య
స్నేహ, సంబంధాలు నెలకొనడమే గాక వంశాభివృద్ధి జరుగుతుంది. అలాంటి ప్రత్యేకత ఉన్న హిందూ వివాహంలో..వరుడు,వధువు మెడలో తాళి కట్టినప్పుడు మూడు ముళ్ళు వేస్తాడు. అలా మూడుముళ్లు ఎందుకు వేస్తారు.. అలా వేయడం వెనుక అసలు రహస్యం ఏమిటి..? శాస్త్రం ఏం సూచిస్తుంది..? హిందూ సాంప్రదాయ ప్రకారం 3 అనే సంఖ్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
త్రిగుణాలు, త్రిలోకాలు, త్రిమూర్తులు ఇలా మూడు అనే అంకెతోనే ముడిపడి ఉంటాయి. అవి మాత్రమే కాకుండా మానవులకు సూక్ష్మ ,స్థూల అనే శరీరాలు కూడా మూడు ఉంటాయి. దాని ప్రకారం పెళ్లిలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానికి సంబంధించినదని అర్థం. వధూవరులు కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా, మూడు
శరీరాలతో కలిసి సహజీవనం చేయాలనేదే ఆ ముడుల వెనుక ఉన్న అసలు రహస్యం. అందుకోసమే శాస్త్రాలు వెల్లడించినట్టుగానే..పూజారులు ఉద్దేశపూర్వకంగానే వధువు మెడలో మూడు ముళ్ళు వేపిస్తారు.
