పూర్వం రోజుల్లో పశువులను ఉరికి దగ్గరలో గల చిట్టడవి, పొలాలలో, ఖాళీ స్థలాల్లో మేపేవారు. అవి అలా ఎండలో స్వేచ్ఛగా మేస్తూ, తెలియకుండానే వివిధ రకాల ఔషధ మొక్కలు తినేవి.
వివిధ రకాల మొక్కలు తినడం వలన వాటిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండేది.
అలా తిన్న తర్వాత అవి ఇచ్చే పాలు, వాటి ద్వారా లభించే పాల ఉత్పత్తులు అధిక వెన్న శాతం, ఔషధ గుణాలు, పోషకాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఓకే చోట కట్టేసి మేపడం,ఒకే రకమైన గడ్డి, ఎండు గడ్డి లో కూడా పురుగు మందు అవశేషాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. చిన్న దానికి కూడా కలుపు మందులు పిచికారీ చేస్తూ ఉండడం వలన ఎన్నో ఔషధ మొక్కల జాతుల వినాశనం అయ్యాయి.
ఇది వరకు కనిపించిన ఉత్తరేణి, కసంత, నేల ఉసిరి ఇంకా అనేక రకాల మొక్కలు ఇప్పుడు కనిపించడంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పాలలో వెన్న శాతం పెరగాలంటే పశువులకు కుడితి పెట్టేటప్పుడు అందులో ప్రతి రోజు పిడికెడు కళ్ళు ఉప్పు (రాక్ సాల్ట్) ను వెయడం వలన ఆటోమేటిగ్గా పాలల్లో వెన్న శాతం పెరుగుతుందని పాడి రంగంలో అనుభవజ్ఞులు సలహా ఇస్తున్నారు.