మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ డి(Vitamin D) ఒకటి. శరీరానికి విటమిన్ డి పుష్కలంగా అందితేనే రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. ఎముకలు, కండరాలు దృఢంగా ఉంటాయి. ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పకుండా ఉంటాయి. గుండె జబ్బులు దరి చేరకుండా ఉంటాయి. మెదడు చురుగ్గా పని చేస్తుంది.
అందుకే విటమిన్ డి ని రెగ్యులర్ గా పొందాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే సూర్యరశ్మి ద్వారా నేరుగా శరీరాన్ని తాకే కిరణాలు వల్ల విటమిన్ డిను పొందొచ్చని విషయం అందరికీ తెలుసు. కానీ, ఎండలో ఎంత సేపు ఉంటే శరీరానికి విటమిన్ డి పుష్కలంగా అందుతుంది..? అన్న విషయం చాలామందికి తెలియదు. నిజానికి మనం ఎంతసేపు సూర్మరశ్మిలో ఉంటామన్న దాని మీదే మన శరీరంలోని విటమిన్ డి ఆధారపడి ఉంటుంది.
అందుకే విటమిన్ డి కోసం ఎండలో ఉండటం కాదు.. ఎంత సమయం పాటు ఉంటున్నాము కూడా చూసుకోవాలి. అయితే వేసవి కాలంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఉదయం పూట పది నుంచి ఇరవై నిమిషాల ఉంటే శరీరానికి విటమిన్ డి చక్కగా అందుతుంది. ఇక శీతా కాలంలో ఎండ కాస్త తక్కువగా ఉంటుంది. అందు వల్ల, గంట నుంచి రెండు గంటల వరకు ఎండలో ఉండొచ్చు.
Also Read : వేడి నీటితో స్నానం చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!
ఇక కొన్ని కొన్ని ఆహారాల ద్వారా సైతం విటమిన్ డిని పొందొచ్చు. చేపలు, పుట్టగొడుగులు, గుడ్డు, బీఫ్ లివర్, చీజ్, కోడి గుడ్లు, పాలు, రొయ్యలు, బీన్స్ వంటి వాటిలో విటమిన్ డి ఉంటుంది. వీటిని కూడా డైట్లో చేర్చుకుంటే.. శరీరంలో విటమిన్ డి లోపం ఉండదు. తద్వారా మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు.