Howrah Bridge : భారతదేశంలో చారిత్రక కట్టడాలకు కొదవలేదు. ఒక్కో కట్టడాం వెనుక ఒక్కో చరిత్ర దాగి ఉంది. దాంట్లో ఒకటి కోల్‌కతాను చెందిన హౌరా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ హుబ్లీ నదిపై ఉంటుంది. చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చూపరులను ఆకర్షించే ఈ బ్రిడ్జి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వంతెన బ్రిటిష్ కాలం నాటికి చెందినది.
బ్రిటిష్ వారు ఈ వంతెనని నిర్మించారు. ఈ వంతెన గుండా రోజుకు దాదాపు లక్ష వాహనాలు, 1.5 లక్షల మంది పాదచారులు నడుస్తూ ఉంటారు. అయితే కోట్లాదిమంది ప్రజలు వినియోగించే ఈ వంతెనను అర్ధరాత్రి 12 గంటలు కాగానే మూసివేస్తారు. ఇలా మూసివేయడం వెనక ఉన్న అసలు కారణం ఏమిటి.?
హౌరా బ్రిడ్జి దగ్గర ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలా అకస్మాత్తుగా చనిపోయిన వారు దయ్యాల రూపంలో అక్కడ అర్ధరాత్రి తిరుగుతుంటారని ఒక వార్త ప్రచారంలో ఉంది. ఈ కారణం చేత రాత్రి 12 దాటిన తర్వాత బ్రిడ్జిని మూసివేస్తారని చెప్తూ ఉంటారు. దీంట్లో ఎంత నిజం ఉందో తెలియదు. అలాగే ఇంకొక వార్త కూడా ప్రచారంలో ఉంది.
ఆ సమయంలో బ్రిడ్జి కింద కారు, బోటు రైలు లాంటివి కూడా నిలిపివేస్తారూ. హౌరా వంతెన పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నదిపై విస్తరించి ఉంది. దీన్ని కాంటిలివర్ వంతెనగా కూడా పిలుస్తారు. వంతెన 280 అడుగుల ఎత్తులో రెండు స్తంభాలపై ఉంది. ఈ స్తంభాల మధ్య దూరం 1500 అడుగులు. అధిక బరువు కారణంగా వంతెన కూలిపోయే ప్రమాదం ఉంది.
ఈ వంతెన నిర్మాణం తర్వాత, ఇంజనీర్లు చెప్పిన విషయం ఏమిటి అంటే.. ఈ పిల్లర్ ఎప్పుడైనా పడిపోతే అది అర్ధరాత్రి 12 గంటల తర్వాతనే జరుగుతుంది. ఆ సమయంలోనే ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువ అని ఇంజనీర్లు చెప్పడంతో. ఆ సమయంలో బ్రిడ్జి కింద కారు, బోటు, రైలు లాంటివి కూడా నిలిపివేస్తారు. ఇక అప్పటినుండి రాత్రి 12 తర్వాత బ్రిడ్జి మూసివేయడం ప్రారంభించారు.
ఈ బ్రిడ్జ్ చాలా పురాతనమైనది. ఎన్నో షూటింగులు కూడా బ్రిడ్జి పైన జరుగుతూ ఉంటాయి. అధిక ట్రాఫిక్ మూలంగా రోజు ఈ బ్రిడ్జి పైన ట్రాఫిక్ జామ్ అవుతూ సమస్యగా మారుతుంది. ఈ బ్రిడ్జిని అనేక రకాలైన దీపాలతో అలంకరణ చేస్తారు. చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది.