Hyderabad Dogs Attack :అంబర్ పేట్ చిన్నారి మృతి ఘటన… అమలపై నెటిజన్ల మండిపాటు
ఆదివారం అంబర్ పేట్ లో కుక్కల దాడిలో చిన్నారి అంత్యంత దారుణం గా చనిపోయిన విషయం తెలిసిందే..ఈ ఘటన యావత్ ప్రజల్ని… తల్లిదండ్రుల్ని భయకంపితులని చేయడం తో పాటు.. హృదయాన్ని పిండేలా చేశాయ్. ఎక్కడపడితే అక్కడ వీర విహారం చేస్తున్న కుక్కల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యం అని ప్రజలు మండిపోతున్నారు.
ఎప్పుడు చూసినా రాజకీయాలు మాట్లాడుకుంటూ.. పార్టీల గురించి ఒకరినొకరు దూషించుకుంటున్నారు తప్పితే.. ప్రజల పట్ల, ప్రజల భద్రత పట్ల ఇసుమంతైనా ఆలోచన లేదని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.కాలనీల్లో పెరిగిపోతున్న కుక్కల బెడద వల్ల చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా ఈ ప్రభుత్వం కి పట్టదా అని.. ఈ ఘటనకి ముమ్మాటికీ ప్రభుత్వ ఉదాసీనతే కారణం అని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా GHMC అధికారులు స్పందించట్లేదు అని.. చిన్నారి మరణానికి సంభందించి ఆ తల్లిదండ్రులకి కలిగిన క్షోభని ఎవరు తీరుస్తారని ప్రశ్నిస్తున్నారు..
ఇదిలా ఉంటే సినీ నటుడు అక్కినేని నాగార్జున భార్య అమలపై కూడా నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. గతంలో కుక్కలని చంపడం కానీ భందించడం కానీ నేరం అంటూ కోర్టుల వరకూ వెళ్లి.. కుక్కల జోలికి ఎవరూ వెళ్లకుండా పోరాటాలు చేసిందని ..వెళితే న్యాయ పరమైన చర్యలు తప్పవని న్యాయ స్థానాలతో ఆదేశాలు ఇప్పించారాని ,దీనితో వాటి సంఖ్య పెరగడానికి… పైగా వాటి వల్ల కలిగే ప్రాణ నష్టానికి పరోక్షంగా అక్కినేని అమల కూడా ప్రధాన కారణం అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు..