Hyderabad kushaiguda:గుళ్లో దొంగతనానికి వచ్చిన దొంగ… కొట్టి చంపిన వాచ్ మెన్
గుళ్లో దొంగతనానికి వచ్చిన ఓ దొంగ…వాచ్ మెన్ చేసిన ఎదురుదాడిలో ప్రాణాలు కోల్పోయిన సంఘటన మంగళవారం రాత్రి కుషాయిగూడలో చోటు చేసుకుంది..
వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లో రాత్రి ఓ దొంగ భీభత్సమ్ సృష్టించాడు.కుషాయిగూడలో ఉన్న స్టానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనానికి ప్రయత్నించి అడ్డు వచ్చిన వాచ్ మెన్ ని రాళ్లతో దాడి చేసి పారిపోబోయాడు. దీనితో అప్రమత్తం అయిన వాచ్ మెన్ దగ్గర్లో ఉన్న కర్రతో ఎదురుదాడి చేశాడు.ఈ దాడిలో తీవ్రగాయాలు అయి దొంగ మృతి చెందాడు.ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.