YCP ప్రభుత్వం పై వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రతిరోజూ వార్తల్లో నిలిచే నరసాపురం MP రఘు రామ కృష్ణంరాజు పై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో YCP శ్రేణులు భారీ గా troll చేస్తున్నాయి. ఒక పబ్‌లో రష్యన్ డాన్సర్ రాజు గారి నోటిలో షాంపైన్ పోస్తూ ఉంటే రాజు గారు డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయనపై విపరీతంగా ట్రోల్స్ చేశారు వైసీపీ అభిమానులు.
దీనిపై రాజుగారు నేడు స్పందించారు. ఆ పిక్ లో ఉన్నది తానే అనీ.. రష్యా అమ్మాయి ఇచ్చే పానీయాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నానని రాజు గారు ఒప్పుకున్నారు. “ఐతే ఏంటి? ఇందులో తప్పు ఏముంది? చాలా మంది షాంపైన్ తాగుతారు. క్రికెటర్లు, సినీ ప్రముఖులు కూడా అదే చేస్తారు. పబ్‌లు మరియు ఫంక్షన్లలో రష్యన్ అమ్మాయిలు అతిథులకు పానీయం అందించడం చాలా సాధారణ విషయం” అని ఆయన చెప్పారు.
“ఇది హైదరాబాద్ లోదా కోల్‌కతా లోదా నాకు గుర్తు లేదు కానీ..
దాదాపు మూడు సంవత్సరాల క్రితం చాలామంది వైసీపీ నాయకులు హాజరైన పార్టీలో తీసిన పిక్” అని ఆయన తెలిపారు.
తాను ఏ మహిళతోనూ అసభ్యంగా ప్రవర్తించలేదని, పార్టీలో కూడా అసభ్యంగా ప్రవర్తించలేదని ఆయన స్పష్టం చేశారు. వారి అందరితో చేసినట్లే రష్యన్ అమ్మాయిలు నాకు పానీయం ఇచ్చారు. నేను దానిలో ఏ తప్పు చూడలేదు అని ఆయన చెప్పారు.
ఈ ఫోటో తీసినపుడు తాను గమనించలేదు కానీ.. టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దీనిని తీసి నన్ను ట్రోల్ చేయడానికి పార్టీ సోషల్ మీడియా కి ఇచ్చి ఉండవచ్చని నేను అనుమానిస్తున్నాను అని రాజు గారు చెప్పారు.