రాష్ట్ర విభజన హామీల్లో అతిముఖ్యమైన విశాఖ రైల్వే జోన్ హామీ వచ్చి తీరుతుందన్నారు ఎంపీ సాయిరెడ్డి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ నూటికి నూరు శాతం వచ్చి తీరుతుందని, కొన్ని పత్రికలు అభూత కల్పనలతో అవాస్తవాలు ప్రచురిస్తున్నాయి అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.
ఒకవేళ రైల్వే జోన్ రాకపోతే నేను రాజీనామా చేస్తానని, రైల్వే జోన్ వస్తే అవాస్తవాలు ప్రచురించిన పత్రికల యజమానులు బహిరంగ క్షమాపణలు చెప్పి వారి పత్రికలను తమకు అప్పగిస్తారా అని సవాలు విసిరారు. రైల్వే జోన్ కోసం వైఎస్సార్సీపీ అలుపెరుగని పోరాటం చేస్తోందని, కొన్ని పత్రికలు తప్పుడు రాతలు రాస్తూ అవాస్తవాలు ప్రచురిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు.
