IBA Women World Championship:మరోసారి ప్రపంచ ఛాంపియన్ షిప్ పై కన్నేసిన యువ బాక్సర్ నిఖత్
తెలంగాణా చిచ్చరపిడుగు.. ఒలంపిక్ స్వర్ణ పతక విజేత,ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ మరోసారి తన పంచ్ పవర్ చూపించడానికి రెడీ అయ్యింది.మరోసారి ప్రపంచ చాంపియన్ షిప్ బరిలోకి దిగబోతుంది.
వచ్చే నెల మార్చి 15 నుండి ఢిల్లీలో జరిగే ఈ ప్రపంచ చాంపియన్ షిప్ లో జరీనా 50 కిలోల విభాగంలో పోటీ పడబోతుంది.గతంలో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటిల్లో గెలిచిన నిఖత్, ఈసారి కూడా విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది.
అయితే నిఖత్ జరీనాతో పాటు ఒలంపిక్స్ లో కాంస్య పథకం సాధించిన లవ్లీ నా 75 కిలోల విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అలాగే వీరిద్దరితో పాటు ఇండియా నుండి నీతు, మనీషా, స్వీటీ, సాక్షి చౌదరిలు కూడా పాల్గొననున్నారు.