ICC T20 Ranking : చరిత్ర సృష్టించిన టీమిండియా..
ఈ ఏడాది వరుస విజయలతో దూసుకెళుతూ భీకర ఫామ్ లో ఉన్న టీమిండియా సరికొత్త చరిత్ర లిఖించింది
గతంలో ఎప్పుడూ సాధించని.. భవిష్యత్ లో మరే టీం కి దాదాపు అసాధ్యం అనుకునే రీతిలో చరిత్ర సృష్టించింది టీమిండియా..తాజాగా ICC ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టెస్టులు, వన్డే లు అనే కాకుండా T20 లో కూడా అగ్రస్థానంలో నిలిచి మొదటి ర్యాంక్ కైవసం చేసుకుంది.
అటు వ్యక్తిగత ర్యాంకింగ్స్ లో కూడా భారత ఆటగాళ్లు సత్తా చాటారు. T20 లో నయా స్టార్ సూరకుమార్ యాదవ్.. వన్డేల్లో హైదరాబాద్ సంచలనం సిరాజ్.. టెస్ట్ ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా మొదటి స్థానంలో నిలిచారు. అలాగే టెస్ట్, ఆల్ రౌండర్ల జాబితాలో అశ్విన్ రెండో ర్యాంకింగ్ లో కొనసాగుతున్నాడు..
మొత్తం మీద భారత క్రికెట్ జట్టు సూపర్ ఫామ్ తో అన్ని జట్ల కంటే అందనత్త ఎత్తులో ఉందని చెప్పొచ్చు