ICC Test Rankings:ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల…..నంబర్ వన్ బౌలర్ గా అవతరించిన అశ్విన్
ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు.
తాజాగా ప్రకటించిన ఐసిసి టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్ లో ఇప్పటివరకు నంబర్ వన్ గా ఉన్న ఇంగ్లాండ్ వెటరన్ జేమ్స్ అండర్సన్ ని వెనక్కినెట్టి 869 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు.ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన సిరీస్ లో మొత్తం 25 వికెట్లు పడగొట్టాడు ఈ స్పిన్ దిగ్గజం
అలాగే భారత బ్యాటర్లలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా 7 స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు.తొమ్మిది, పదో స్థానాల్లో వరుసగా రిషబ్ పంత్, కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచారు.స్పిన్నర్ జడేజా మాత్రం ఒక స్థానం దిగజారి 8వ స్థానం నుండి 9కి పడిపోయాడు.