Immunity Boosting Food : శరీరంలో రోగనిరోధక శక్తి లేకపోతే అనారోగ సమస్యలు ఈజీగా అటాక్ చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చాలా రకాల ఆహార పదార్థాలు మనకు అందుబాటులో ఉంటాయి. సహజంగా మనకు దొరికే ఆహారాల తోటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ముఖ్యంగా మన శరీరానికి ప్రోటీన్లు, మినరల్స్ అందకపోతే మాత్రం రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, మినరల్స్, జింక్ కచ్చితంగా అందేలాగా చూసుకోవాలిమ్ ఇవి ఏ పదార్థాలలో లభ్యమవుతాయో తెలుసుకుందాం..
ఆమ్ల : రోగనిరోధ శక్తిని పెంచడంలో విటమిన్ సి కలిగినటువంటి ఆమ్లా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది తీసుకుంటే దగ్గు, జలుబు లాంటి సమస్యలు కూడా దరిచేరవు.
పసుపు : ముఖ్యంగా వంటకాలలో పసుపు చాలా ప్రధానమైనది. పసుపు తీసుకోవడం వల్ల రుమటాయిడ్, ఆర్థరైటిస్ సమస్యలు తగ్గుతాయి. అలాగే పసుపు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తుంది.
పెరుగు : పెరుగులో లాక్టిక్ యాసిడ్ అలాగే విటమిన్ డి అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో చాలా సహాయం చేయడంతో పాటు ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తాయి.
స్పినాచ్ : ఆకుకూరలు తీసుకోవడం వల్ల రోగిని శక్తి పెరుగుతుంది. ఆకుకూరల్లో విటమిన్ ఏ, సి ,ఇ మనకు లభిస్తాయి. ముఖ్యంగా స్పీనాచ్ తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది.
అల్లం : అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికం. అల్లం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు రావు. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్లో అల్లం కూడా ఒకటి.
వెల్లుల్లి : వెల్లుల్లి తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా గుండె జబ్బులు రాకుండా అదుపులో ఉంటుంది. జలుబు సమస్యతో బాధపడేవారు వెల్లుల్లి తీసుకోవడం మంచిది.