సోమవారం ఉదయం 10:00 గంటలు నుంచి ముంబాయి సిటీలోని చాలా చోట్ల పవర్ కట్ మొదలైన విషయం తెలిసిందే.. ఈ పవర్ కట్ దాదాపు అన్నిచోట్లా కనీసం రెండు గంటల పాటు కొనసాగింది. రెండు గంటల తర్వాత కొంచెం కొంచెంగా కొన్ని కొన్ని ఏరియాలకి విద్యుత్ పునరుద్ధరణ చేసారు. కానీ సాయంత్రానికి కూడా ఇంకా కొన్ని ఏరియాల్లో పవర్ పూర్తిగా పునరుద్ధరణ అవ్వలేదు. పవర్ కట్ అవ్వడానికి గ్రిడ్ ఫెయిల్యూర్ అవ్వడమే కారణం అని రాష్ట్ర ఎనర్జీ మంత్రి నితిన్ రావత్ ప్రకటించారు.
అయితే ఇది ఇలా ఉండగా ముంబాయిలో పవర్ కట్ అయిన విషయం సోషల్ మీడియా ద్వారా దావానంలా వ్యాపించింది. సామన్యులనుండి సినిమా ఇండస్ట్రీ పెద్దల వరకూ అందరూ ఇదే విషయం మీద ట్విట్టర్ లో మోత మోగించారు.
అందరూ ట్వీట్ లు ఒక ఎత్తు అయితే అందరికీ భిన్నంగా దేశంలో ఉన్న అసలు పరిస్తితుల మీద సోనూసూద్ ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే “ముంబయిలో రెండు గంటలపాటు విద్యుత్ లేకపోయేసరికి ఆ వార్త మొత్తం దేశానికి తెలిసిపోయింది. కానీ దేశంలోని అనేక చోట్ల ఇప్పటికీ ఇళ్లకు కనీసం రెండు గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడం లేదు. కాబట్టి దయచేసి అందరూ కాస్త సహనం ఓపిక ప్రదర్శించాలి.”
సోనూ ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతుంది, సోనూ చెప్పిన మాట 100% నిజమంటూ అతనికి సపోర్ట్ చేస్తూ రీట్వీట్ లు పడుతున్నాయి. ఎంతైనా సోనూ చెప్పిన మాట100% నిజం ప్రజలు కొంచెం సహనంతో ఉండాలి. మనకి కనీసం రోజూ కరెంటు ఉంటుంది. కానీ, అసలు కరెంటు కనెక్షన్ కూడా లేని ఊర్లు ఇండియాలో చాలా చోట్ల ఉన్నాయ్..