Ind Vs Aus 2nd Test : ఢిల్లీ టెస్టులో అద్భుత విజయం సాధించిన భారత్…
ఢిల్లీ వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కార్ ట్రోఫీ రెండో టెస్ట్ లో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించి.. నాలుగు టెస్టుల సిరీస్ లో 2-0 తేడాతో ముందంజ వేసింది.
క్రితం రోజు స్కోర్ 61/1 తో బ్యాటింగ్ కొనసాగించిన ఆసీస్ 117 పరుగులకే ఆలౌట్ అయింది..
జడేజా సుడులు తిరిగే బంతులకి ఆసిస్ దగ్గర సమాధానమే లేకపోయింది. చివరి 9 వికెట్లు కేవలం 59 పరుగులకే కోల్పోయి.. భారత్ ముందు 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
దీనితో 118 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి చేదించింది.
జడేజా మ్యాజిక్..
అంతకుముందు ఆసిస్ పతనం లో ఆఫ్ స్పిన్నర్ జడేజా దే కీ రోల్… కేవలం 42 పరుగులకే 7 వికెట్లు కూల్చి కెరీర్ లో ఉత్తమ గణంకాలు నమోదు చేశాడు. మరోవైపు అశ్విన్ మిగతా 3 వికెట్లు తన ఖాతాలో వేసుకుని అద్భుతమైన సహకారం అందించాడు..

అన్నింట్లో మనమే నంబర్ వన్…
ఇదిలా ఉంటే ఈ గెలుపుతో టెస్ట్ ల్లో కూడా భారత్ నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకుంది.. ఇప్పటికే వన్డే ల్లో T20 ల్లో నంబర్ వన్ గా కొనసాగుతున్న భారత్.. తాజా విజయం తో ముచ్చటగా మూడు ఫార్మాట్ లలో అగ్రస్థానం కైవసం చేసుకున్నట్టు అయింది..