UNRWA( యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ) కి ఇండియా 1 మిలియన్ డాలర్లు ఇచ్చిన భారత గవర్నమెంట్. పాలస్తీనియన్ శరణార్ధులు కోసం ఏర్పడిన UNRWA, కరోనా మహమ్మారి సమయంలో అత్యంత సంక్షోభం లో ఉన్న పాలస్తీనియన్ శరణార్ధులు సహాయం కోసం ఇస్తున్నట్లు ప్రకటించింది ఇండియా.
UN ఏజన్సీ కి 1 మిలియన్ డాలర్ల చెక్కుని అందచేసిన పాలస్తీనా లో ఉన్న ఇండియా ప్రతినిధి సునీల్ కుమార్. ఇండియా సహయం పై UNRWA స్పందిస్తూ “అత్యంత కఠినమైన సందర్భంలో మీరు చేసిన సహాయం ఎప్పటికీ మరువలేది, ఒక ఒక్క ఇండియాలో కరోనా వైరస్ విధ్వంసం సాగుతున్న పరిస్తితులలో కరోనాతో పోరాడుతూనే మాకు గురించి ఆలోచించి ఆర్థిక సహాయం అందించిన ఇండియా కి ధన్యవాదాలు, అలాగే వైరస్ నుండి ఇండయా త్వరగా కోలుకోవాలి అనిపార్థిస్తున్నాం” అని ప్రకటన విడుదల చేసింది.
అయితే పాలస్తీనియన్ శరణార్ధులు కి ఇండియా సహాయం చేయడం ఇదేమి మొదటిసారి కాదు, దశాబ్దాల కాలం నుండి ఇండియా ఆర్థిక సహాయం అందిస్తూనే ఉంది.
2016 వరకూ ప్రతీ సంవత్సరం ఇచ్చే 1.25 మిలియన్ డాలర్లు ని 5 మిలియన్ కి పెంచిన ఇండియా 2018, 2019 ఆల్రెడీ అందచేసింది. 2020 మే నెలలో ఇచ్చిన 2 మిలియన్ల తో కలిపి 2020 లో ఇండియా సహాయం మొత్తం 3 మిలియన్లు అయింది.