దేశ రాజధాని న్యూఢిల్లీ లో కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ తన ప్రతాపం చూపుతుంది. ఇవాళ ఒక్కరోజే ఢిల్లీలో 5673 కేసులు నమోదు అయ్యాయి. నిన్న 4853 కేసులు నమోదు అయ్యి, సెప్టెంబరు 16 న నమోదు అయిన 4473 అత్యధిక కేసులు రికార్డు బద్దలయ్యి 24 గంటలు తిరగకముందే మళ్లీ కొత్త రికార్డు క్రియేట్ అయింది.
మొదటిసారిగా జూన్ జూలైలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా జరగకా ఆ తర్వాత మెల్లగా తగ్గుతూ వైరస్ కంట్రోల్ అవుతున్నట్టే అనిపించింది. అయితే ఆగష్టులో పూర్రిగా అదుపులోకి వచ్చినట్టే వచ్చి సెప్టెంబరు మధ్య నుండి మళ్లీ తీవ్ర ప్రభావం చూపడం మొదలుపెట్టింది.
అయితే జూన్ జూలైలో వైరస్ వ్యాప్తి జరిగినప్పుడు, వైరస్ ని నిరోధకత కోసం కేంద్ర హోంశాఖ నిపుణులతో కమిటీ ఏర్పాటుచేసింది. నిపుణులు కమిటీ నీతిఆయోగ్ మెంబర్ డా. వికే పాల్ అప్పుడే అంచానలు చెప్పారు, వచ్చే శీతాకాలంలో ఢిల్లీలో డైలీ 15 వేల కేసులవరకూ చూసే అవకాసం ఉందని.
ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ, ఢిల్లీలో డైలీ కరొనా టెస్ట్ లు ఒక క్రమంలో చేస్తున్నామని, ఒకరికి పాజిటివ్ నిర్థారణ అయితే వెంటనే ఆ ఫ్యామిలీ మొత్తాని టెస్ట్ చేస్తున్నామని అప్పుడు ఆ ఫ్యామిలీ లో కూడా పాజిటివ్ లు వస్తున్నాయని, అందువల్లే కేసులు పాజిటివ్ రేటు పెరిగింది అని ఆయన తెలిపారు. పైగా ఇంతకుముందు డైలీ 20 వేలు టెస్ట్ కు మాత్రమే చేసేవాళ్ళమని, ఇప్పుడు దాదాపు 60 వేలు పనే టెస్ట్ లు చేస్తున్నామని ఇది కూడా డైలీ కేసులు పెరగడానికి ఒక కారణం అని ఆయన తెలిపారు.
ఒక పక్క దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ దేశ రాజధానిలో సెకండ్ వేవ్ కలవరపెడుతుంది. ఢిల్లీ మాదిరి మిగతా అన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ మొదలైతే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో అని ప్రజల్లో కలవరం మొదలైంది.
అందుకే ఎవరికి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని మోదీ నుండి ప్రతీ ఒక్కరూ ఇదే మాట చెప్తున్నారు.