India vs Australia 2nd T20 Result : రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఘన విజయం, కంగారులకు వరుసగా రెండో ఓటమి..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోవడంతో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నాలుగు వికెట్స్ నష్టానికి 235 భారీ స్కోర్ చేసింది. అనంతరం 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టీం 20 ఓవర్లు తొమ్మిది వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేసింది.
టీమిండియా ఓపెనర్స్ రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడుతూ ఆరు ఓవర్లలో 77 పరుగులు సాధించారు. 25 బంతుల్లో 53 పరుగులు చేసి జైస్వాల్ అవుట్ అవ్వడంతో బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ 3 ఫోర్లు నాలుగు సిక్సర్స్ తో 32 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఈ దశలో స్కోరు 164 వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది.
దాంతో క్రీజు లోకి వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మరోసారి దూకుడు గా బ్యాటింగ్ మొదలు పెట్టినా భారీ స్కోరు గా మలచలేక పోయాడు. పది బంతుల్లో 19 పరుగులు చేసిన సూర్య అవుట్ అవ్వడంతో రింకు సింగ్ బరిలోకి దిగాడు. రింకూ సింగ్ లోకి దిగడంతోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసాడు. కేవలం తొమ్మిది బంతుల్లో 31 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ సాధించేలా చేశాడు. దీంతో టీమిండియా మొత్తం 235 పరుగులు చేసింది.
అనంతరం 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 35 పరుగుల వద్ద మొదటి వికెట్ను కోల్పోయింది తర్వాత 39 పరుగులు కి రెండో వికెట్ కోల్పోయి ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో ప్రసిద్ధి కృష్ణ, రవి బిష్ణోయ్ చరో మూడు వికెట్లు తీశారు..