India Vs Australia 3rd One Day :లాస్ట్ పంచ్ ఎవరిదో … కాసేపట్లో భారత్ ఆస్ట్రేలియా చివరి వన్డే
చెన్నై వేదికగా భారత్,ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా చెరొకటి గెలిచిన భారత్ ఆస్ట్రేలియా నిర్ణయాత్మక పోరులో శాయశక్తులా పోరాడడానికి రెడీ అయ్యాయి. కాసేపట్లో మ్యాచ్ ఆరంభం అవబోతుంది.

ఇప్పటికే జరిగిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ భారత్ 2-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ వన్డే కూడా గెలిచి సిరీస్ పట్టేయాలని భారత్ చూస్తుండగా. గత వన్డేలో సాధించిన విజయపు ఉత్సాహంలో ఉన్న ఆస్ట్రేలియా, కనీసం వన్డే సిరీస్ గెలుపుతో తో అయినా స్వదేశం వెళ్లాలని భావిస్తోంది.భారత్ టీం లో ఎలాంటి మార్పులు లేకుండా గత టీం తో నే బరిలోకి దిగుతుండగా, ఆస్ట్రేలియా మాత్రం గ్రీన్ స్థానంలో వార్నర్ ని ఆడిస్తుంది.
