India Vs Australia 4th Test:లాస్ట్ పంచ్ ఎవరిదో.. నేడే భారత్, ఆసిస్ చివరి టెస్ట్
భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ సమరంలో చివరి టెస్ట్ ఇరు దేశాల ప్రధానుల మధ్య జరగడానికి రంగం సిద్ధం అయింది. ఈ ఉదయం 09:30 నుండి అహ్మదాబాద్ వేదికగా తుది సమరం జరగనుంది.

టెస్ట్ క్రికెట్ లో అత్యంత హోరాహోరీ సమరాల్లో ఒకటైన భారత్ ఆస్ట్రేలియా పోరు చివరి అంకానికి చేరింది. ఈ సిరీస్ లో ఇప్పటికే అధిక్యంలో ఉన్న భారత్, ఈ టెస్ట్ గెలిచి బోర్డర్ గవాస్కార్ ట్రోఫీ తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కి కూడా అర్హత సాధించాలని పట్టుదలతో ఉండగా…కనీసం ఈ టెస్ట్ కూడా గెలిచి సిరీస్ ని సమం చేయాలని ఆసీస్ భావిస్తుంది. అటు గత కొన్ని నెలలుగా ఏ పర్యాటక జట్టుకు సాధ్యం కాని విధంగా సిరీస్ లో రెండు టెస్టులు నెగ్గిన ఘనతను సొంతం చేసుకోవాలని ఆస్ట్రేలియా ఆలోచన.గత టెస్ట్ అనుభవం దృష్ట్యా ఈసారి టీం ఇండియా పూర్తి స్పిన్ పిచ్ వైపు మొగ్గు చూపకపోవచ్చు. కాబట్టి ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఇరు జట్లకి సమాన అవకాశాలు ఉన్నాయనే అంటున్నారు క్రికెట్ పండితులు.

ఈ సిరీస్ లో ఇప్పటివరకు చూస్తే భారత్ జట్టు బ్యాటర్లకి బాగానే పరీక్ష పెట్టింది. రోహిత్ శర్మ మినహా మరెవరు సెంచరీ చేయలేకపోయారు ఈ సిరీస్ లో. కేవలం బౌలర్ల చలవతోనే గత రెండు టెస్టులు భారత్ గెలవగలిగింది.
ఈ నేపథ్యంలో ప్రధాన ఆటగాళ్లు అంతా ఈ మ్యాచ్ లో అయినా రాణించాలని మేనేజ్ మెంట్ భావిస్తుంది.
అటు ఆస్ట్రేలియా గత టెస్ట్ గెలుపు ఆనందం లో మరింత కసిగా ఆడి ఈ టెస్ట్ గెలవాలని ఉత్సాహం తో ఉంది. పైగా బ్యాటింగ్ బౌలింగ్ అంశాల్లో చాలా మెరుగ్గా కనబడుతున్నారు.ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్న నిర్ణాయాత్మక
చివరి టెస్ట్ లో ఏం జరుగుతుందో, ఎవరిని విజయం వరిస్తుందో అనేది .
