పవన్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారిలో వివిధ రంగాల వారు ఆయన కోసం ఏదైనా చేసే వీరాభిమానులు ఉన్నారు. తాజాగా పవన్ బర్త్ డే సందర్భంగా ఎవరూ ఊహించని రీతిలో పాకిస్తాన్ కి దిమ్మతిరిగే షాక్ ఇస్తూ వాళ్ళు చేసిన పని ఇపుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది.
ఇండియన్ సైబర్ ట్రూప్ అనే పేరుతో కూడిన సైబర్ హ్యాకర్స్ బృందం పాకిస్తాన్ ప్రభుత్వ వెబ్ సైట్ ని హ్యాక్ చేసి, అందులో… పవన్ కళ్యాణ్ కి హ్యాపీ బర్త్డే విషెస్ తెలిపారు. ఆయన నటించిన ఖుషి చిత్రంలోని ఏ మేర జహా అనే పాట బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేలా వెబ్ సైట్ లో పోస్ట్ చేశారు.