హైదరాబాద్ కేంద్రంగా వ్యాక్సిన్ తయారీ సంస్థ ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (IIL)భారీ పెట్టుబడి పెట్టనుంది. జీనోమ్ వ్యాలీలో జంతు వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రూ.700 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది.
ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ సంస్థ 700 కోట్ల పెట్టుబడులు పెడుతోన్నట్టు మంత్రి కేటీఆర్ తో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశంలో తెలిపారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ జోరు కొనసాగుతుందని కేటీఆర్ అన్నారు.