Influenza Virus: తెలంగాణాలో దూసుకొస్తున్న మరో వైరస్… కీలక సూచనలు చేసిన మంత్రి హరీష్ రావు
తెలంగాణా లో ప్రభలుతున్న ఇన్ ఫ్లుయెంజా వైరస్ వ్యాధుల పట్ల తాజాగా ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రజలకి పలు కీలక సూచనలు చేశారు.
తాజాగా తెలంగాణాలో పెరుగుతున్న ఇన్ ఫ్లుయెంజా కేసులపై ప్రజలు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,ఇలాంటి లక్షణాలతో ఆసుపత్రి ల లో కేసులు స్వల్పంగా మాత్రమే పెరిగాయాని, ఇలాంటి వైరస్ లక్షణాలు వస్తే యాంటిబయాటిక్స్ పెద్దగా వాడాల్సిన అవసరం లేదని అన్నారు.జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు ఉంటే వెంటనే స్థానిక అసుపత్రికి వెళ్లాలని, డాక్టర్ ని సంప్రదించి వారు చెప్పిన మందులు వాడితే సరిపోతుందని, ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకునేంత తీవ్ర లక్షణాలు ఏవీ లేవని తెలిపారు.